Amit Shah: ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు 3 వరకు చర్చిద్దాం: అమిత్ షా
Amit Shah: నీట్ పరీక్ష లీకేజీ.. సీజేపీ నిరసన.. ఈ అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం 3 గంటల వరకు చర్చిస్తామన్నారు.
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష లీకేజీ.. సీజేపీ నిరసన.. అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం 3 గంటల వరకు చర్చిస్తామన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో ఇవాళ మాట్లాడారు. లాపతా, భాగ్ గయా అన్న భాషను వాడుతున్నారని, కానీ తాను పార్లమెంట్‌కు రెగ్యులర్‌గా వస్తున్నానని తెలిపారు. తన ఛాంబర్‌లోనే తాను కూర్చుకుంటానని, కానీ విపక్షాలు మాత్రం పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నాయని చెప్పారు. నీట్ నిరసనలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తమ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పష్టంగా చెప్పారన్నారు. చర్చ కోసం సమయం కేటాయించాలని చెప్పానని, కానీ విపక్షాలు మాత్రం కేవలం స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాయని, ఎవరు సభ నుంచి పారిపోతున్నారో ఇప్పుడు ప్రజలకు తెలియాలని అమిత్ షా అన్నారు.
అన్ని కోణాల్లో చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి రేపు 3 వరకు చర్చిద్దామన్నారు. సభలో కూర్చుంటానని, అన్ని పాయింట్లకు సమాధానం ఇస్తానని, ప్రభుత్వం ఏదీ దాచిపెట్టడం లేదని అన్నారు. సీరియస్ అంశాలపై కేవలం స్టేట్మెంట్లు సరిపోవు అని, లోతుగా చర్చ జరగాలని, దేశ ప్రజలకు నిజం తెలియాలని, డిస్కషన్లో పాల్గొంటారా లేక ఆందోళనలు చేస్తారా అన్న విషయాన్ని విపక్షాలు తేల్చుకోవాలని అమిత్ షా పేర్కొన్నారు.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, “I want to tell the Opposition: submit a letter to the Speaker by 2:00 PM, we will start the discussion at 3:00 PM, and I will provide answers to everything by 3:00 PM tomorrow. There are established rules and procedures for… pic.twitter.com/Q8ZdZfvxdW
— ANI (@ANI) August 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

