Miss Universe Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
Miss Universe | ఇజ్రాయెల్‌లో ఆదివారం జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీలో భారత్‌కు చెందిన హర్నాజ్ సంధు గెలుపొందింది. భారత్‌కు 21 ఏళ్ల తరువాత మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. అంతకు ముందు విశ్వ సుందరిగా 1994లో సుష్మిత సేన్, 2000లో లారా దత్తా నిలిచారు

ఇజ్రాయెల్‌లో ఆదివారం జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీలో భారత్‌కు చెందిన హర్నాజ్ సంధు గెలుపొందింది. భారత్‌కు 21 ఏళ్ల తరువాత మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. అంతకు ముందు విశ్వ సుందరిగా 1994లో సుష్మిత సేన్, 2000లో లారా దత్తా నిలిచారు. 2021 మిస్ యూనివర్స్ విన్నర్‌గా అవతరించిన 21 ఏళ్ల హర్నాజ్ సంధు గురించి విశేషాలు
పంజాబ్ రాజధాని చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు వృత్తిపరంగా ఒక మోడల్. చండీగఢ్‌లోనే డిగ్రీ పూర్తి చేసిన హర్నాజ్ ప్రస్తుతం మాస్టర్స్ కూడా చదువుకుంటోంది. ఒకవైపు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొంటూ.. మరోవైపు చదువుని కొనసాగిస్తోంది ఈ 21 ఏళ్ల అమ్మడు. అంతేకాదు రెండు పంజాబీ సినిమాలలో కూడా నటించింది.

17 ఏళ్ల వయసు నుంచే మోడలింగ్ ప్రారంభించిన హర్నాజ్ ఇప్పటివరకు నాలుగు బ్యూటీ కాంటెస్ట్‌లలో విన్నర్‌గా నిలిచింది. 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్, 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్, 2021 లో మిస్ యూనివర్స్ ఇండియా కితాబులను అందుకుంది.
స్కూల్ చదువుకునే రోజులలో హర్నాజ్ చాలా సన్నగా ఉండడంతో తోటి విద్యార్థులు ఆమెను ఏడ్పించేవారు. దీంతో కొంతకాలం ఆమె డిప్రెషన్ బారినపడింది. ఆ సమయంలో హర్నాజ్ కుటుంబం తోడుగా నిలబడడంతో ఆమె త్వరగా కోలుకొంది. మోడలింగ్, అందాలపోటీలలో ఇప్పటివరకు విజేతగా నిలిచిన ఈ అందాల భామ డైటింగ్ చేయనంటోంది. నోటికి రుచిగా ఉండేవి అన్నీతింటానని చెప్పింది. కానీ రోజూ వర్కౌట్స్ తప్పనిసరి అని చెప్పుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Miss Universe Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
Harnaaz Sandhu | మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్ సంధు
Harnaaz Sandhu | విశ్వసుందరి పోటీల్లో హర్నాజ్ చేసిన ఈ పని వైరల్!
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

