ప్రపంచ సుందరి కిరీటం అందుకొని భారత ఖ్యాతిని హర్నాజ్ సంధూ మరోసారి చాటిచెప్పింది. ఈ పోటీల్లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది. మిస్ యూనివర్స్-2021 పోటీల్లో హర్నాజ్.. టాప్-16లో నిలిచినప్పుడు ఈ ఘటన జరిగింది.
ఈ సమయంలో కార్యక్రమం వ్యాఖ్యాత స్టీవ్ హార్వే అభ్యర్ధులతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే హర్నాజ్ దగ్గరకు కూడా వచ్చాడు. ఏదో ఒక జంతువులా యాక్ట్ చేయాలని హార్వే అడిగాడు.
దీంతో ఒకింత షాకైన హర్నాజ్.. ‘ఓ మై గాడ్ స్టీవ్.. ఇలాంటి ప్రపంచ వేదికపైన ఇలా చేయాల్సి వస్తుందని నేననుకోలేదు. కానీ తప్పదు కదా. వేరే దారిలేదు’ అని చెప్పింది. ఆ తర్వాత అందరూ చూస్తుండగా విశ్వసుందరి పోటీల వేదికపై ‘మ్యావ్.. మ్యావ్’ అంటూ పిల్లిలా సౌండ్ చేసింది.
ఆ సమయంలో స్టీవ్ హార్వీతోపాటు ఇతర పోటీదారులు కూడా నవ్వేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ పోటీల్లో విజయం సాధించిన హర్నాజ్.. విశ్వసుందరి కిరీటం అందుకున్న సంగతి తెలిసిందే.
THE VERY MOMENT SHE WON #MissUniverse pic.twitter.com/a7xd5K0iPU
— Danilo Sanches (@danilo_sanches) December 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Harnaaz Kaur Sandhu | విశ్వ వేదికపై మెరిసిన పంజాబీ అందం హర్నాజ్ కౌర్ సంధు.. (ntnews.com)
Miss Universe Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
Harnaaz Sandhu | మిస్ యూనివర్స్గా భారత యువతి హర్నాజ్ సంధు
Harnaaz Sandhu | విశ్వసుందరి పోటీల్లో హర్నాజ్ చేసిన ఈ పని వైరల్!
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..