Pedro Sanchez : మరో మధ్యప్రాచ్య యుద్ధం (Middle East war) లోకి తమను లాగవద్దని, తాను అలాంటి చర్యను కోరుకోలేదని స్పెయిన్ ప్రధాని (Spain PM) పెడ్రో సాంచెజ్ (Pedro Sánchez) అన్నారు. ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నందుకు స్పెయిన్‌ను తమతో వాణిజ్య కార్యకలాపాల నుంచి తొలగిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించిన మరుసటి రోజే స్పెయిన్ ప్రధాని ఈ కామెంట్ చేశారు.
బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన స్పెయిన్ ప్రధాని.. ‘ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టిన వారి లక్ష్యాలు ఏమిటో స్పష్టత లేదు. స్పెయిన్ మరో మధ్యప్రాచ్య యుద్ధంలోకి లాగబడాలని తాను ఎన్నడూ కోరుకోలేదు. పలు దేశాల తీర్మానం తర్వాతనే తాము.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు యుద్ధం ఆపాలనే డిమాండ్‌ను వినిపించాం. మీ చట్టవిరుద్ధమైన చర్యలపై చట్టవిరుద్ధంగా స్పందించడం సబబు కాదు. అలాంటి చర్యల వల్లనే మనవాళి భారీ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
స్పెయిన్‌ను వాణిజ్యం నుంచి తొలగిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిగానే పెడ్రో సాంచెజ్ ఈవిధంగా స్పందించారని తెలుస్తోంది. కాగా ఇరాన్‌పై, ఇజ్రాయెల్, అమెరికా తీవ్రంగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో స్పెయిన్ సహా పలు దేశాలు.. మరింత ఆలస్యం చేయకుండా యుద్ధాన్ని ఆపాలని ఆ మూడు దేశాలను డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో స్పెయిన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా స్పెయిన్ ప్రధాని స్పందించారు.