హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మెల్ ద్వారా విద్యార్థులకు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్ల విద్యార్థి గడదాస్ అభినవ్ తన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ-శ్రీలతతో సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అభినవ్‌ను కేటీఆర్ శాలువాతో ఘనంగా సతరించి ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్ స్మైల్ కింద అందజేశారు. కళాశాల ఫీజు కూడా తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. చకగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని, ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. తమ కుమారుడి విద్యాభివృద్ధికి అండగా నిలిచిన కేటీఆర్‌కు అభినవ్ తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.