Sreeleela | టాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ఇప్పుడు తన కెరీర్‌ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. గ్లామర్, డ్యాన్స్, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ యంగ్ బ్యూటీ, కేవలం ఐటమ్ సాంగ్స్‌కే పరిమితం అయితే కెరీర్‌పై ప్రభావం ఉంటుందని ముందుగానే అంచనా వేసి జాగ్రత్త పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.కొన్ని ప్రాజెక్టుల్లో హీరోయిన్ అవకాశంతో పాటు ఐటమ్ సాంగ్ చేయాలని కండీషన్స్ పెట్టినప్పుడు, ఆ ఆఫర్లను సైతం వదులుకోవడంలో ఆమె వెనుకాడలేదని సమాచారం. స్క్రిప్ట్, పాత్ర ప్రాముఖ్యత, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రతి ప్రాజెక్ట్ ముందు కుటుంబ సలహాలు కూడా తీసుకుంటోందని టాక్.
ప్రస్తుతం శ్రీలీల తెలుగు సినిమాల కంటే హిందీ, తమిళ చిత్రాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్లో సంచలన మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఆషికి 3 లో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా కనిపించనుంది. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో భావోద్వేగాలు, ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నప్పటికీ, పాత్రకు అవసరమైతే పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి సిద్ధమని శ్రీలీల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే, ఆమె బాలీవుడ్ కెరీర్‌కు గేమ్ చేంజర్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో శ్రద్ధా కపూర్‌కూడా ‘ఆషికీ 2’తో భారీ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇదే కాంబినేషన్లో మరో యాక్షన్ థ్రిల్లర్ కూడా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ‘ఫీటమ్ పురా’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం. అధికారిక ప్రకటన రానప్పటికీ, ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమా ఆఫర్ రావడం ఆమె క్రేజ్‌ను చూపిస్తోంది. అంతేకాకుండా, కోలీవుడ్ స్టార్ ధనుష్ 55వ చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. కెరీర్ ప్రారంభ దశలోనే ధనుష్ సరసన నటించే అవకాశం రావడం ఆమెకు పెద్ద ప్లస్‌గా భావిస్తున్నారు. ఇక టాలీవుడ్లో ఆమె నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలో విడుదల కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్‌కు జోడీగా కనిపించనుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే శ్రీలీల పేరు మళ్లీ టాలీవుడ్లో మారుమ్రోగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలివైన నిర్ణయాలతో కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్న శ్రీలీల, దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకూ తన మార్క్ చూపించడానికి సిద్ధమవుతోంది. రానున్న రోజులు ఆమె కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి.