టెహ్రాన్: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి(Abbas Araghchi).. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. చర్చలు జరుగుతున్న టేబుల్‌పై .. ఆవేశంతో బాంబు దాడి చేసినట్లు పేర్కొన్నారు. తన సోషల్ మీడియా పోస్టులో ఇరాన్ మంత్రి ఈ కామెంట్ చేశారు. ఇరాన్‌పై దాడి జరగడానికి ముందు.. అమెరికా ప్రతినిధులతో ఇరాన్ చర్చలు నిర్వహించింది. అయితే ఆ చర్చలు కొలిక్కి రాకముందే.. ట్రంప్ తన సహనాన్ని కోల్పోయి దాడులకు పాల్పడినట్లు అరగాచి ఆరోపిస్తున్నారు. చాలా సంక్లిష్టమైన అణు కేంద్రాలపై చర్చలు జరుగుతున్న వేళ.. ఆ సంప్రదింపులను ఓ రియల్ ఎస్టేట్ ట్రాన్జాక్షన్లా ట్రంప్ చూశారని, వాస్తవాలను అబద్ధపు పెను మేఘాలు కమ్ముకుంటే, అంచనాలు చేరుకోవడం వీలు కాదు అని మంత్రి అబ్బాస్ తన పోస్టులో వెల్లడించారు. అణు పాలసీపై చర్చలు ముగియకముందే.. ట్రంప్ ఆవేశంతో బాంబు దాడులకు పాల్పడినట్లు మంత్రి ఆరోపించారు. దౌత్య విధానాన్ని , తనను ఎన్నుకున్న అమెరికన్లను కూడా ట్రంప్ మోసం చేసినట్లు మంత్రి అబ్బాస్ పేర్కొన్నారు.
When complex nuclear negotiations are treated like a real estate transaction, and when big lies cloud realities, unrealistic expectations can never be met.
The outcome? Bombing the negotiation table out of spite.
Mr. Trump betrayed diplomacy and Americans who elected him.
— Seyed Abbas Araghchi (@araghchi) March 4, 2026