Naga Bandham | మూడే వారాల్లో ఓటీటీలోకి ‘నాగ బంధం’.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం
Naga Bandham | యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ పీరియాడిక్ అడ్వెంచర్ చిత్రం 'నాగ బంధం' థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాలకే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ విజువల్ గ్రాండియర్‌పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Naga Bandham | యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ పీరియాడిక్ అడ్వెంచర్ చిత్రం ‘నాగ బంధం’ థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాలకే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ విజువల్ గ్రాండియర్‌పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లలో మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. భారీ నిర్మాణ విలువలు, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ సరసన నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటించారు. ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విడుదలకు ముందు సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. అదే ప్రభావంతో తొలి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ కూడా ఆశాజనకంగా నమోదయ్యాయి.
అయితే విడుదల అనంతరం కథ, స్క్రీన్‌ప్లే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. అయినప్పటికీ యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్ ట్రీట్, నేపథ్య సంగీతం, పీరియాడిక్ సెట్స్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా థియేటర్లలో చూడలేకపోయిన సినీ అభిమానులు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తికి తెరదించుతూ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక నేటి నుంచే ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హిందీ మినహా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం వీక్షించేందుకు అవకాశం కల్పించారు.
థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులతో పాటు ఫాంటసీ, మైథాలజికల్ అడ్వెంచర్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘నాగ బంధం’ ఓ మంచి వీకెండ్ ఎంటర్టైనర్గా నిలిచే అవకాశముంది. థియేట్రికల్ రన్లో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా, ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతుందేమో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

