Mahesh Babu | బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. మహేష్‌ను స్వయంగా ఆహ్వానించిన నిర్మాత, వైరల్‌గా మారిన ఫొటోలు
Mahesh Babu | టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట త్వరలో పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన కుమార్తె జనని వివాహ వేడుకను ఆగస్టు 16న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివాహ ఆహ్వాన పత్రికల పంపిణీ వేగంగా సాగుతుండగా, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను బండ్ల గణేష్ స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.
Mahesh Babu | టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట త్వరలో పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన కుమార్తె జనని వివాహ వేడుకను ఆగస్టు 16న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివాహ ఆహ్వాన పత్రికల పంపిణీ వేగంగా సాగుతుండగా, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను బండ్ల గణేష్ స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ని బండ్ల గణేష్ ప్రత్యేకంగా కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన జనని_సూర్యప్రణామ్ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టు చేశారు.
మహేష్ బాబు చూపించిన ఆత్మీయత, వినయం తనను ఎంతో ఆకట్టుకున్నాయని, ఎంత పెద్ద స్టార్ అయినా ఆయనలోని మృదు స్వభావం ఏమాత్రం మారలేదని కొనియాడారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యుల యోగక్షేమాలను కూడా మహేష్ ఆప్యాయంగా అడిగి తెలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. బండ్ల గణేష్ షేర్ చేసిన ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మహేష్ బాబు కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. “సూపర్ స్టార్ లుక్ అదిరిపోయింది”, “అంబానీ వెడ్డింగ్ లుక్కే పోటీ ఇస్తోంది”, “జై బాబు” అంటూ అభిమానులు కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఇదిలా ఉంటే, బండ్ల గణేష్ కేవలం మహేష్ బాబునే కాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర తారలను కూడా స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఇతర ప్రముఖులకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు అందించినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో అందరితో మంచి అనుబంధం కలిగిన బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి టాలీవుడ్‌కు చెందిన అగ్రశ్రేణి ప్రముఖులు ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉండటంతో ఈ వేడుకపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్లు హాజరైతే ఈ వివాహం టాలీవుడ్లో మరో చిరస్మరణీయ వేడుకగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

