KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో తన చిన్ననాటి ఫొటోను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. ప్రియమైన సోదరుడు కేటీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల పట్ల మీ అచంచల నిబద్ధత, దూరదృష్టి నాయకత్వం, కరుణామయ స్వభావం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని సంతోష్ కుమార్ అన్నారు. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, మరింత శక్తి చేకూరాలని, సమాజ సేవలో మరెన్నో సంవత్సరాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. మీరు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అన్నయ్య అని తెలిపారు.
Wishing my dearest brother @KTRBRS garu a very Happy Birthday.
Your unwavering commitment to the people, your visionary leadership and your compassion continue to inspire millions. May you be blessed with good health, happiness, strength and many more years of dedicated service… pic.twitter.com/vpc0TxOg1Z
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 24, 2026