Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Miss Universe | రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. సరిగ్గా 21 ఏండ్ల తర్వాత విశ్వ సుందరి కిరీటాన్ని భారత్ దక్కించుకుంది. చివరి సారిగా 2000 సంవత్సరంలో భారత్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకోగా, మళ్లీ

హైదరాబాద్ : రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. సరిగ్గా 21 ఏండ్ల తర్వాత విశ్వ సుందరి కిరీటాన్ని భారత్ దక్కించుకుంది. చివరి సారిగా 2000 సంవత్సరంలో భారత్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకోగా, మళ్లీ ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. 1952లో మిస్ యూనివర్స్ పోటీలను ప్రారంభించగా, భారత్ నుంచి ఇప్పటి వరకు ముగ్గురే ముగ్గురు విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
1994లో తొలిసారి సుస్మితాసేన్ విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది.. 2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు పంజాబ్ భామ హర్నాజ్ సంధూ(21) మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొతం చేసుకుంది. లారా దత్త కిరీటం గెలుచుకున్న ఏడాదే హర్నాజ్ కౌర్ జన్మించింది. హర్నాజ్ 2017 నుంచే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటున్నారు. గత ఏడాది విశ్వసుందరి, మెక్సికో భామ ఆండ్రియా మేజా హర్నాజ్‌కు మిస్ యూనివర్స్ కిరీటం అలంకరించింది.
Harnaaz Kaur Sandhu | విశ్వ వేదికపై మెరిసిన పంజాబీ అందం హర్నాజ్ కౌర్ సంధు.. (ntnews.com)
సుస్మితా సేన్..
భారత నటి, మోడల్ సుస్మితా సేన్ 1975, నంబర్ 19న జన్మించారు. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోగా, 18 ఏండ్ల వయసులోనే ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. భారత్ నుంచి తొలిసారిగా విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న సుందరిగా సుస్మితా సేన్ చరిత్రకెక్కింది. బీవీ నంబర్ 1 చిత్రంలో నటించిన సుస్మితాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వరించింది.
లారా దత్తా..
1978, ఏప్రిల్ 16న జన్మించిన లారా దత్త 2000 ఏడాదిలో విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈమె నటి, ఎంటర్ప్రెన్యూర్ కూడా. 1997లో మిస్ ఇంటర్కాంటినెంటల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. చాలా హిందీ సినిమాల్లో లారా దత్తా నటించారు. ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుపొందింది.

హర్నాజ్ సంధూ..
హర్నాజ్ సందూ 2000, మార్చి 3న చండీగఢ్‌లో జన్మించారు. 17 ఏండ్ల వయసులోనే మోడలింగ్ ప్రారంభించారు. మాస్టర్స్ చదవుతూనే అందాల పోటీల్లో పాల్గొంటున్నారు. 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్‌గా నిలిచింది. 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్‌గా నిలిచింది. 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్‌గా నిలిచింది. మిస్ దివా-2021 కిరీటాన్ని కూడా దక్కించుకున్నారు. పలు పంజాబీ సినిమాల్లో నటించి అందర్నీ మెప్పించారు హర్నాజ్ సంధూ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Miss Universe Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
Harnaaz Sandhu | మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్ సంధు
Harnaaz Sandhu | విశ్వసుందరి పోటీల్లో హర్నాజ్ చేసిన ఈ పని వైరల్!
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

