Health tips | కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!

న్యూఢిల్లీ : వ్యాధులు దరిచేరకుండా దీర్ఘకాలం ఆరోగ్యంతో జీవించాలని కోరుకోని వారుండరు. మనం తీసుకునే ఆహారం, శారీరక వ్యాయామం వంటి అంశాలే మన ఆరోగ్యం, జీవనకాలాన్నినిర్ధేశిస్తాయని నిపుణులు చెబుతుంటారు. దీర్ఘకాలం బతకడమనేది మన చేతుల్లో లేకపోయినా ఆరోగ్యకరమైన అలవాట్లతో వ్యాధులకు దూరంగా దీర్ఘాయువును సొంతం చేసుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

ఆరోగ్యకర ఆహారం, పానీయాలను తగు మోతాదులో తరచూ తీసుకోవడం, శారీరక వ్యాయామం, తగినంత నిద్ర, మద్యపానానికి, ధూమపానానికి దూరం కావడం, నలుగురితో కలివిడిగా ఉండటం వంటి అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దీర్ఘకాలం జీవించవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇక గ్రీన్‌టీతో దీర్ఘాయువు సొంతం చేసుకోవచ్చని తాజా పరిశోధన స్పష్టం చేసింది. గ్రీన్‌టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలీపెనాల్స్ శరీరానికి మేలు చేకూరుస్తాయి.

శరీరాన్ని చురుకుగా చేయడంతో పాటు కీలక అవయవాలు, శారీరక, మానసిక ఉల్లాసానికి గ్రీన్ టీ ఉపకరిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. గ్రీన్ టీ రోజూ సేవిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గడం, గుండె జబ్బుల ముప్పును నివారించవచ్చు. గ్రీన్ టీ అన్ఆక్సిడైజ్డ్ ఆకుల నుంచి తయారవడం మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గందని జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో ప్రచురితమైన ఒషాకి అధ్యయనం వెల్లడించింది. 40-79 ఏండ్ల వయసు వారిపై 11 ఏండ్ల పాటు నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెలుగుచూశాయి. 40,000 మంది జపనీయులపై జరిగిన ఈ అధ్యయనం రోజుకు ఐదు కప్పుల గ్రీన్ టీ తాగిన వారిలో గుండె జబ్బులతో మరణాల రేటు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

