న్యూఢిల్లీ: మిస్ యూనివర్స్ విజేత హర్నాజ్ సంధూ.. సాంప్రదాయ దుస్తుల్లో జిగేల్మంది. వేదికపై ఆమె భారతీయ కట్టుబోట్టుతో ఆకట్టుకున్నది. 21 ఏళ్ల అందాల భామ హర్నాజ్.. మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా వేదికపై సాంప్రదాయ మహిళ లుక్‌లో అదరగొట్టింది. పింక్ గోల్డ్ కలర్ లహెంగాలో.. చేతిలో వెడ్డింగ్ ఛత్రిని పట్టుకుని ఆమె స్టేజ్‌పై క్యాట్‌వాక్ చేసింది. ధగధగ లాడే ఆభరణాలు.. గాజులు, రింగ్, మెడలో హారం, నుదిటి హారాన్ని ధరించి.. ఇండియన్ లుక్‌లో సంధూ కేక పుట్టించింది. నేషనల్ కాస్ట్యూమ్ సెగ్మెంట్లో హర్నాజ్ ఇలా తన వయ్యారాలను వలికించింది. ఈ లెహంగాను అభినవ్ మిశ్రా డిజైన్ చేశాడు. ఇక ఛత్రిని రేజా షరీఫ్ డిజైన్ చేయడం విశేషం. సాంప్రదాయ లెహంగా.. ఛత్రితో స్టేజ్‌పై క్యాట్‌వాక్ చేసిన వీడియోను సంధూ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఇది భారతీయ రాణుల వైభోవోపేతమైన అలంకరణ అంటూ సంధూ తన వీడియోలో తెలిపింది. సాంప్రదాయ లుక్ బలంగా ఉన్నా.. చాలా సున్నితమైందని, మహిళల రక్షణకు ఈ అలంకరణ సింబల్‌గా నిలుస్తుందన్న ఉద్దేశాన్ని ఆమె వినిపించింది.
What an incredible look from India! 👏 #missuniverse
— Miss Universe (@MissUniverse) December 10, 2021
Download the Miss Universe app to vote for your favorite costume! pic.twitter.com/9N3No4K9pJ