హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల డాటా ఇవ్వాలని జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీలను ఆదేశించింది. సోమవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ కాలేజీల్లో ఎమర్జెన్సీ హెల్త్ సపోర్ట్‌కు తీసుకుంటున్న చర్యలు, ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల వివరాలు రిపోర్టులో పొందుపర్చాలని కోరింది.
మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని కోరింది. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎన్ఎంసీ విద్యార్థులను హెచ్చరించింది. తరగతుల నుంచి బహిష్కరణతోపాటు స్కాలర్షిప్లు నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. పరీక్షల నుంచి డిబార్ చేయడంతోపాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తామని, పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించింది.