చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!

skin cancer | మెలనిన్ అనే పేరు వినే ఉంటారు. మన శరీరపు రంగుకు ఈ పదార్థమే కారణం. సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను తట్టుకునేందుకు మెలనిన్ ఉపయోగపడుతుంది. మెలనోసైట్స్ అనే కణాలు ఇందుకు దోహదం చేస్తాయి. ఈ మెలనోసైట్స్లో తీవ్రమైన మార్పులు వస్తే… అది చర్మ క్యాన్సర్కు దారితీస్తుంది. దీన్నే మెలనోమాగా పిలుస్తారు. అమెరికాలోని హన్ట్స్మేన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈమధ్య మెలనోమాకి సంబంధించి, ఓ కీలకమైన పరిశోధనను వెలువరించింది. మన పుట్టుమచ్చలకు కారణం అవుతున్న జన్యుమార్పులే, చర్మ క్యాన్సర్లోనూ కనిపిస్తున్నాయని తేల్చింది. పుట్టుమచ్చల విషయంలో ఒక స్థాయి వరకూ జరిగే మార్పు, క్యాన్సర్ విషయంలో అడ్డ్డూఅదుపూ లేకుండా కొనసాగడమే… సమస్యకు కారణం అవుతుందని నిర్ధరించింది. ఈ పరిస్థితిని అదుపు చేయగలిగితే జన్యు మార్పులు క్యాన్సర్కు దారితీయకుండా నివారించవచ్చనీ, వచ్చినా కూడా తీవ్రతరం కాకుండా చికిత్స చేయవచ్చనీ భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Donkey milk | గాడిద పాలు యమ కాస్ట్లీ.. అక్కడ ఒక్క స్పూను రూ.100కు అమ్ముడవుతోంది తెలుసా!
Lip care tips | చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
WHO on Omicron : ఒమిక్రాన్ వ్యాప్తిపై అనిశ్చితి.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన ఏంటంటే..?
Omicron variant | గుడ్న్యూస్.. ఈ ఒక్క ట్రీట్మెంట్తో ఒమిక్రాన్ ఖతం!!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

