WHO on Omicron : ఒమిక్రాన్ వ్యాప్తిపై అనిశ్చితి.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన ఏంటంటే..?
WHO on Omicron : ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై ఇంకా అనిశ్చితి వీడటం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచదేశాలను డబ్ల్యూహెచ్ఓ ...

(WHO on Omicron) ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై ఇంకా అనిశ్చితి వీడటం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచదేశాలను డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తున్నది. ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇదే సమయంలో, ఇది ప్రాణాంతకమా? అనేది వెల్లడించడం తొందరే అవుతుందని తెలిపింది. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం 57 దేశాల్లో బయటపడింది. దీని బారిన పడే వారి సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వేరియంట్‌కు సంబంధించిన పలు కీలకమైన ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రాలేదు. రానున్న రోజుల్లో అందే డాటా ఆధారంగా దీని ప్రభావం ఎంత ఉంటుందో చెప్పగలమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటున్నది.
గత నెలలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు షురూ అయ్యాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలను తిరిగి అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ దాదాపు 26.7 కోట్ల మందికి సోకగా.. దాదాపు 52 లక్షల మంది చనిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ముఖ్యంగా వ్యాధి ప్రబలడం, తీవ్రత, తిరిగి ఇన్ఫెక్షన్ కావడం, టీకాల ప్రభావం.. అనే నాలుగు అంశాలపై తమ ఆందోళనను వ్యక్తం చేసింది. డెల్టా ట్రాన్స్మిషన్ తక్కువగా ఉన్నప్పుడు ఒమిక్రాన్ బయటపడిందని, ఫలితంగా అప్పుడు ఒమిక్రాన్ పోటీ ఇవ్వలేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ పేర్కొన్నారు. ఈ వేరియంట్ ఎంత మేరకు ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యవేక్షణ చాలా ముఖ్యమన్నారు.
ఇంకా డెల్టాపైనే ఆందోళన..
‘ఇంకనూ మా ఆందోళన అంతా డెల్టా మహమ్మారిపైనే ఉన్నది. కొత్త వేరియంట్‌తో ఏమి జరుగుతుందో కూడా గమనిస్తున్నాం. ఇప్పటివరకు 40 శాతం వ్యాక్సిన్ కవరేజీ లక్ష్యాన్ని చేరుకోలేని 50 కి పైగా దేశాలు ఉన్నాయి. ఇదే మమ్మల్ని తీవ్రంగా కలవరపెడుతున్నది’ అని డబ్ల్యూహెచ్ఓ ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్స్, బయోలాజికల్స్ విభాగం డైరెక్టర్ కేట్ ఓబ్రెయిన్ వెల్లడించారు. ఇలాఉండగా, తమ కొవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షించగలదని ఫైజర్ సంస్థ బుధవారం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
వైరస్‌తో ఊబకాయులకు యమ డేంజర్ అంటున్న నిపుణులు
వాట్సాప్‌లో హలో మమ్మీ! హలో డాడీ.. అంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త!.. ఎందుకంటే..
వేరియంట్‌కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు : వైరల్ వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

