(TTD Udayastamana Seva) ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి టిక్కెట్ల రేట్లను కూడా టీటీడీ ఖరారు చేసింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవల టికెట్ ధర రూ.కోటిగా ఉండగా.. శుక్రవారం మాత్రం రూ.1.50 కోట్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం టీటీడీ వద్ద 531 ఉదయాస్తమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల ద్వారా వచ్చే మొత్తాన్ని తిరుపతి పద్మావతి చిన్నపిల్లల దవాఖాన అభివృద్ధికి వినియోగించాలని యోచిస్తున్నారు.
దాదాపు రూ.600 కోట్లను సమీకరించాలని ఆలోచనగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చే భక్తులు 25 ఏండ్ల పాటు ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు అర్హులవుతారు. అలాగే, ఏడాది పాటు సుప్రభాత సేవలో పాల్గొనేందుకు అవకాశం పొందుతారు. డిసెంబరు 11 నాటి టీటీడీ బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినప్పటికీ.. అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విరాళంగా సేకరించే మొత్తాన్ని కూడా అప్పుడు నిర్ణయించలేదు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..