Thief Arrest: 14 ఏండ్లు.. వంద ఇండ్లకు కన్నాలు.. చివరకు చిక్కాడిలా..!
Thief Arrest: కావలి పోలీసులు కరుడుగట్టిన దొంగను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 184 గ్రాముల బంగారం, 315 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన డబ్బులో...

(Thief Arrest) నెల్లూరు: కావలి పోలీసులు కరుడుగట్టిన దొంగను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 184 గ్రాముల బంగారం, 315 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన డబ్బులో చాలా మటుకు జల్సాకు వినియోగించినట్లు దొంగ ఒప్పుకున్నాడు. దొంగ విశాఖ నగరంలోని గాజువాకకు చెందిన బోలా నాగసాయిగా పోలీసులు గుర్తించారు. ఇతడిపై ఆంధ్రప్రదేశ్‌లోని 6 జిల్లాలతోపాటు హైదరాబాద్, చెన్నై నగరాల్లో కూడా దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. నాగసాయి అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
గత జూలై నెలలో జైలు నుంచి విడుదైన బోలా నాగసాయి.. కావలిలోని ముసునూరు రాఘవేంద్ర కాలనీలోని రెండిండ్లతోపాటు ఒకటో పట్టణం పరిధిలో రెండు, నెల్లూరు జిల్లా కేంద్రంలో 8 ఇండ్లలో చోరీలకు పాల్పడ్డాడు. దొంగిలించిన బంగారం, ఇతర వస్తువులను అమ్మగా వచ్చిన నగదుతో విలాసాలు చేసేవాడు. గత కొన్నాండ్లుగా తప్పించుకు తిరుగుతున్న నాగసాయి.. అనుమానాస్పద రీతిలో తచ్చాడుతుండగా పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. గత 14 ఏండ్లుగా చోరీలను ప్రధాన వృత్తిగా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు వందకు పైగా ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నాగసాయి ఏనాడూ ఫోన్ వాడడు. ఒక ప్రాంతంలో దొంగతనం చేసే ముందు అక్కడి ఇంట్లో అద్దెకు దిగి టార్గెట్ ఎంచుకుంటాడు. దొంగతనం చేశాక ఇంట్లో వస్తువులను అలాగే వదిలేసి చక్కాపారిపోతాడు. జైలుకెళ్లడం, బయటకు రావడం, దొంగతనాలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో కూడా దొంగతనాలకు పాల్పడిన ఈ దొంగ చివరకు కావలి పోలీసులకు చిక్కాడు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న కావలి గ్రామీణ సీఐ ఖాజావలి, ఎస్సై వెంకట్రావుతోపాటు సిబ్బందిని డీఎస్పీ ప్రసాద్ అభినందించారు.
ఇవి కూడా చదవండి..
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Thief Arrested
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

