Harish Rao : మీ భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి విడిపించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు ప్రజలకు హామీ ఇచ్చారు. న్యాయబద్ధంగా, కష్టార్జితంతో సంపాదించిన భూములు నిషేధిత జాబితాలో ఉంటే ఫోన్ చేయాలంటూ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిందని, అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదని హరీశ్‌రావు చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ పని చేయకపోయినా మా జనతా గ్యారేజ్ (తెలంగాణ భవన్) తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని హరీశ్‌రావు అన్నారు. మూసిపరివాహక ప్రాంతంలోని ఇండ్లను హైడ్రా కూలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు జనతా గ్యారేజ్ తలుపు తట్టారని, అప్పుడు వాళ్లకు న్యాయం చేశామని అన్నారు. అదేవిధంగా నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్ల విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.