‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోండి’
నవంబర్ 1, 2023 నాటికి ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా పాసైన అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో...
– మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
కొత్తగూడెం గణేష్ టెంపుల్, అక్టోబర్ 03 : నవంబర్ 1, 2023 నాటికి ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా పాసైన అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉచిత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్లమెంటరీ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి సూచనల మేరకు ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు సంకుబాపన అనుదీప్, వేముల ప్రసాద్ బాబు, కరాటే శ్రీను, కన్ని, అన్వర్, పూర్ణ, మనోజ్, ఈమంది గణేష్, ఎమునూరిశివ, మదాసు పద్మ, షరీఫ్, అంబుల వేణు గోపాల్, జున్నరు రాజేష్ గౌడ్, షణ్ముఖ, సోహెబ్, సచిన్, రాకేష్ రెడ్డి వేణు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

