Peddi | హనుమకొండ చౌరస్తా: దివంగత నేత తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్రహాన్ని కూల్చడాన్ని నిరసిస్తూ చలో నర్సంపేట నిర్వహించాలని వరంగల్ పశ్చిమ బీఆఆర్ఎస్ నాయకులు పిలుపు ఇచ్చారు. దీనిలో భాగంగా ముందస్తుగా వారిని అరెస్టు చేసి హనుమకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రభుత్వ అండదండలతో మున్సిపల్, పోలీసులను అడ్డుపెట్టుకొని విగ్రహాన్ని కూల్చివేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులను జిల్లావ్యాప్తంగా అరెస్టు చేసి , గృహనిర్బంధాలు చేస్తున్నారని, ప్రజాపాలన పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని, దివంగత నేత విగ్రహంపై ఇంత అరాచకాలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ నేత విగ్రహం పెట్టుకునే హక్కు ఉందని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వారు అన్నారు.
అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ (BRS) పార్టీ పశ్చిమ కో ఆర్డినేటర్ పులి రజనీకాంత్, మాజీ కార్పొరేటర్లు చెన్నం మధు, సోదా కిరణ్, మైనార్టీ కమిషన్ మాజీ సభ్యులు జూని దర్శన్‌సింగ్, 4వ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ కంజర్ల మనోజ్‌కుమార్, బీఆర్ఎస్వీ కాకతీయ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంద శ్యామ్, పుష్పలత, బీఆర్ఎస్వీ నాయకులు రాసురి రాజేష్ ఉన్నారు.