Counterfeit currency: నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్ట్
Counterfeit currency : నకిలీ కరెన్సీని ముద్రించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన ఒక ముఠాను పెడన పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు యూట్యూబ్ ద్వారా...

(Counterfeit currency) కృష్ణా: నకిలీ కరెన్సీని ముద్రించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన ఒక ముఠాను పెడన పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు యూట్యూబ్ ద్వారా నకిలీ కరెన్సీ తయారుతోపాటు వాటిని ప్రింట్ చేసి సర్క్యులేట్ ఎలా చేయాలో 3 నెలల పాటు అధ్యయనం
చేశారు. అయితే వీరి ప్లాన్‌ను ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో నకిలీ కరెన్సీ బట్టబయలైంది. పెడన పట్టణంలో పట్టుబడిన నకిలీ కరెన్సీకి సంబంధించిన వివరాలను మచిలీపట్నం డీఎస్పీ షేక్ మాసూంబాషా వివరించారు. ఈ కేసులో సూత్రధారి సహా మొత్తం ఎనిమిది మందిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
వీరభద్రపురానికి చెందిన కాసా వెంకటేశ్వర్రావు, కాసా నాగరాజు అనే వ్యక్తులు తమ ఇంట్లోనే స్కానర్, ప్రింటర్, పేపర్ కట్టర్లతో నకిలీ కరెన్సీ ముద్రణ పనులను నిర్వహిస్తున్నారు. లక్ష విలువైన అసలు కరెన్సీకి బదులుగా 4 లక్షల నకిలీ నోట్లను ఇచ్చే వ్యాపారంలో 35-40 శాతం కమీషన్ ఇచ్చే మధ్యవర్తులు కూడా వీరితో చేరారు. ఈ క్రమంలో పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెంకు చెందిన ముచ్చు శివ తన తల్లి వైద్య ఖర్చుల నిమిత్తం రామలక్ష్మి వీవర్స్ కాలనీకి చెందిన వాసా వెంకటేశ్వరరావు నుంచి రూ.2వేలు తీసుకని స్థానిక మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేని డబ్బు ఇచ్చాడు. ఆ నోట్ల తేడా గమనించిన దుకాణం యజమాని నకిలీవని నోట్లని తేల్చాడు.
దాంతో తనకు డబ్బిచ్చిన కాసా వెంకటేశ్వరరావును ప్రశ్నించగా.. తనకు వీరభద్రపురానికి చెందిన కాసా నాగరాజు, అతడి కుమారుడు నాగరాజు ఇచ్చారని చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిన శివ పెడన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ నోట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరుపుతున్నట్లు మచిలీపట్నం డీఎస్పీ షేక్ మాసూంబాషా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్‌లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

