(Rushihood University)న్యూఢిల్లీ: భారతదేశం చరిత్ర, విజ్ఞానఖనిగా ఉన్న గుర్తింపును గుర్తుచేసుకుంటూ మరోసారి ప్రపంచానికి మన దేశాన్ని జ్ఞానప్రదాయినిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రస్తుత మన విద్యావిధాన్ని భారతీయీకరించాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ఈ దిశగా మనం వేయబోతున్న గొప్ప ముందడుగన్నారు. భారతదేశాన్ని సృజనాత్మకతకు, మేధోసంపత్తికి కేంద్రంగా మార్చే దిశగా నూతన జాతీయ విద్యావిధానం ఎంతగానో తోడ్పడుతోందన్నారు. శనివారం విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రుషిహుడ్ విశ్వవిద్యాలయాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
విశ్వగురుగా భారతదేశం ప్రపంచానికి మార్గదర్శనం చేసిన చరిత్రను ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నలంద, తక్షశిల, పుష్పగిరి వంటి మన విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి జ్ఞానాన్ని సముపార్జించుకునేవారని అన్నారు. అంతటి గొప్ప విశ్వగురు స్థానాన్ని తిరిగి పొందేందుకు మన విద్యావ్యవస్థ కృషిచేయాలన్నారు. ఈ దిశగా రుషిహుడ్ విశ్వవిద్యాలయం ఎంచుకున్న మార్గాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. విద్యతోపాటు విలువలు, మన సంస్కృతి, సంప్రదాయాలను. పరిశోధనాత్మకత, సృజనాత్మకతలను బోధించినప్పుడే ఆ ఉన్నతస్థానానికి చేరగలమన్నారు. ప్రాచీన విద్యావిధానాన్ని వెలుగులోకి తెస్తూ భవిష్యత్ యువతరానికి మార్గదర్శనం చేయడంలో రుషిహుడ్ విశ్వవిద్యాలయం విజయం సాధించాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, రుషిహుడ్ విశ్వవిద్యాలయ చాన్స్లర్ సురేశ్ ప్రభు, విశ్వవిద్యాలయ సహ వ్యవస్థాపకులు డాక్టర్ చిన్మయ్ పాండ్య, మోతీలాల్ ఓస్వాల్,అశోక్ గోయల్తోపాటు విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..