(Seminor on TB) న్యూఢిల్లీ: వచ్చే మూడేండ్ల వరకు భారతదేశం నుంచి క్షయవ్యాధిని నిర్మూలించేందుకు సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి కీలక పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. ఇందుకోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘ఉమెన్ విన్నింగ్ అగెనెస్ట్ టీబీ’ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మానసిక దృఢత్వం, క్రమశిక్షణతోపాటు నిపుణుల సలహాలను నిరంతరం పాటించడం ద్వారా ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనవచ్చునన్నారు.
క్షయవ్యాధి బారిన పడుతున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉండటంపై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ చేయడం ద్వారా వారిలో మానసిక స్థైర్యాన్ని కల్పించాలన్నారు. పౌష్టికాహారాన్ని అందించడం, క్షయవ్యాధిగ్రస్తులైన గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం తదితర చర్యల ద్వారా మహిళలను ఈ వ్యాధి బారి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖమంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండావియా, మహిళా, శిశుసంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపరా మహేంద్రభాయ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇందీవర్ పాండేతోపాటు అధికారులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, అంగన్ వాడీ కార్యకర్తలు, క్షయవ్యాధి నిర్మూలనకు కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..