(Kiladi ledi) అనంతపురం: తెలంగాణలో శిల్పా చౌదరి మోసాలు ఒకవైపు బయటకు వస్తుండగా.. ఏపీలో మరో కిలాడీ లేడీ మోసం బయటపడింది. అధిక వడ్డీ ఆశ చూపి.. రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది. దాంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఆమె బాధితులుగా మారిపోయారు. ఈ కిలాడీ లేడీ ఏదో సాదా సీదా మహిళ కాదు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కావడం విశేషం. ఆమె పదవిని చూసి నమ్మేసిన జనం.. ఈజీగా ఆమె బుట్టలో పడిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా పద్మశ్రీ పనిచేస్తున్నారు. ఆమె కొన్ని రోజుల క్రితం సిగ్మాసిక్స్ ఎంటర్ప్రైజెస్ పేరిట ఒక సంస్థను ప్రారంభించి అధిక వడ్డీలు ఇస్తానంటూ జనానికి ఆశ పెరిగేలా చేసింది. లక్ష రూపాయలు అప్పుగా ఇస్తే.. నెలకు రూ.10 వేల చొప్పున వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికింది. ఈవిడ మాటలను నమ్మిన చాలా మంది ఈమెకు అప్పుగా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. తన టార్గెట్ రీచ్ కాగానే.. రాత్రికి రాత్రే ఊరు వదిలి పారిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు ఆమె ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.
అధిక వడ్డీ వస్తుందని ఆశపడి నగలమ్మి పద్మశ్రీకి డబ్బులిస్తే.. తడిగుడ్డతో గొంతుకోసిందని బాధితులు వాపోయారు. పద్మశ్రీపై అనంతపురం పోలీస్ స్టేషన్లో బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, వైస్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ స్నేహితురాలు ఒకరి ద్వారా డబ్బులు ఇచ్చినట్లు పలువురు బాధితులు ఆరోపించారు. తాను కూడా పద్మశ్రీకి డబ్బులిచ్చి మోసపోయినట్లు సదరు స్నేహితురాలు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్‌లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..