Tarique Rahman | ఇండియా విషయంలో తారిఖ్ రహమాన్ కీలక నిర్ణయం.. వీసా సేవల పునరుద్ధరణ
Tarique Rahman : బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు.
Tarique Rahman : బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ఈ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య వీసాల జారీ రెండు నెలలక్రితం నిలిచిపోయింది. మూడు నెలల క్రితం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగాయి.
అలాగే ఇండియాలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో గత ఏడాది డిసెంబర్ నుంచి రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వీసాల జారీ ఆగిపోయింది. ఇటు ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో, అటు ఢాకాలోని భారత రాయబార కార్యాలయంలో వీసాల జారీ నిలిచిపోయింది. అయితే, తాజాగా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తారిఖ్ రహమాన్ మూడు రోజుల్లోనే ఇండియాతో సంబంధాల విషయంలో సానుకూలంగా స్పందించాడు. వీసాలు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో ఢిల్లీలో శుక్రవారం ఉదయం నుంచి బంగ్లా రాయబార కార్యాలయంలో అన్ని రకాల వీసాల మంజూరు సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఢాకాలో కూడా బంగ్లా నుంచి ఇండియాకు వచ్చేందుకు వీసాల సేవల్ని పునరుద్ధరిస్తామని అనిరుద్ధా దాస్ అనే బంగ్లాలోని భారత రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. మెడికల్, టూరిజం వంటి అన్ని రకాల వీసా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక.. బంగ్లాలో తారిక్ ప్రమాణ స్వీకారానికి ఇండియా నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. తాజాగా తారిక్ ఇండియాతో సంబంధాల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నాడు. దీంతో త్వరలో రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మెరుగవుతాయని విశ్లేషకుల అంచనా.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

