భోపాల్: కంటైనర్ లారీ ఒక కారును ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణించిన ఆరుగురు ఈ ప్రమాదంలో మరణించారు. కంటైనర్ లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (6 Killed In Accident) మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బద్నవార్ పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని పంచక్ వాసా సమీపంలో ఉజ్జాయినీ నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఒక కారును ఢీకొట్టింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ప్రయాణించిన ఆరుగురు అక్కడికక్కడే మరణించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మృతులు గుజరాత్ వాసులని చెప్పారు. కంటైనర్ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.