గురుకులంలో ఎలుకల కలకలం.. నిద్రిస్తున్న విద్యార్థినులను కొరికిన ఎలుకలు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం రాత్రి 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కొరుకడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
- 14 మందికి గాయాలు.. దవాఖానకు తరలింపు
- పిల్లల తల్లిదండ్రులకు సమాచారమివ్వని సిబ్బంది
- పాలకుర్తి బడిలో ఘటన
పాలకుర్తి, సెప్టెంబర్ 24 : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం రాత్రి 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కొరుకడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
వారిని బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స వేయించారు. 14 మందికి వైద్యం చేసినట్టు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వనం శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయం బయటకు రాకుండా పాఠశాల సిబ్బంది, యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వక పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

