KCR | తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్ది స్వగృహానికి ఆదివారం చేరుకున్న కేసీఆర్..ముందుగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైన కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు అందించాలని.. ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పెద్ది కుటుంబసభ్యులకు వాటికి సంబంధించిన పత్రాలను అందజేశారు.పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Kcr Peddi Family2
పెద్ది పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అంశాలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Kcr Peddi Family3
పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ అనంతరం జిల్లా పార్టీ ముఖ్యులు సమావేశమై ఆయన కుటుంబానికి అందించాల్సిన ఇతర సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

Kcr Peddi Family4
కాగా, కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు దారిపొడవునా ఆయనకు సంఘీభావం తెలిపాయి. పలుచోట్ల కేసీఆర్ తన కాన్వాయ్‌ను ఆపి కార్యకర్తలను పలకరించి ధైర్యం చెప్పారు.
కంటతడి పెట్టుకున్న కేసీఆర్
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో భావోద్వేగానికి గురైన కేసీఆర్ https://t.co/aEX01wEaBe pic.twitter.com/S0kc8OfACD
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2026