(PRC Suspense) విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీపై ఉత్కంఠ కొనసాగుతున్నది. అంతకుముందు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. వారి అభిప్రాయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ సంఘాలతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నది. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సజ్జల రామకృష్ణారెడ్డి.. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలుసుకుని ప్రభుత్వ పరిస్థితిని వివరించారు. ఇలాఉండగా, ప్రభుత్వ ఉద్యోగులు తాము కోరినట్లుగా ఫిట్మెంట్ ఇస్తారని సీఎం జగన్పై ఆశలు పెట్టుకున్నారు.
అధికారుల కమిటీ సిఫార్సులు ఉద్యోగుల అంచనాలకు అనుగుణంగా లేవని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగులకు 34 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని, ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలతో సజ్జల సమావేశమై పీఆర్సీపై సీఎస్ ఇచ్చిన నివేదికను ఆమోదించాలని కోరగా.. అందుకు వారు నిరాకరించినట్లు సమాచారం. అయితే, అశుతోష్ మిశ్రా పీఆర్సీ నివేదికను అమలు చేయాలని, 55 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. 71 హామీలు అమలు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఉద్యోగులు స్పష్టం చేశారు. దాంతో పీఆర్సీపై ఇంకనూ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. దాంతో ఉద్యోగులు ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇస్తానంటున్న పీఆర్సీపై లెక్కలు వేసుకోవడం కనిపించింది.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..