(Suger Farmers) విజయనగరం: తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని ఆందోళనకు దిగితే.. తమకే నోటీసులు పంపుతున్నారని విజయనగరం జిల్లా సీతానగరం చెరకు రైతులు వాపోతున్నారు. ఇలా నోటీసులు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు చెల్లించమని ప్రశ్నిస్తే నోటీసులిస్తారా అంటూ నిలదీస్తున్నారు.
విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం పరిధిలోని దాదాపు 2,400 మంది రైతులకు రూ.16.33 కోట్ల బకాయిలను యాజమాన్యం చెల్లించాలి. బకాయిలు సాధించేందుకు నవంబరు 3న చెరకు రైతులు 36 వ రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. రైతులను అరెస్టు చేస్తున్న సమయంలో ఘర్షణ చెలరేగి పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దాంతో 22 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. నెలరోజులు దాటిన తర్వాత ఇప్పుడు వారందరికీ పోలీసులు నోటీసులిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు ఆందోళన చేసిన రైతులను వీడియో దృశ్యాల ఆధారంగా గుర్తించి నోటీసులు సిద్ధం చేశారు. ఇప్పటివరకు బొబ్బిలి, సీతానగరం మండలాల పరిధిలో దాదాపు 80 మందికి నోటీసులిచ్చినట్లు సమాచారం.
రైతుల ఆందోళన నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు పంచదార నిల్వల్లో 36 వేల క్వింటాళ్లను అధికారులు గత నెల 23 న వేలం వేశారు. దీన్ని రూ.11.54 కోట్లకు చెన్నైకి చెందిన ఓ వ్యాపారి దక్కించుకుని.. అనంతరం కోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో లభించింది. దాంతో నిధుల జమ మళ్లీ మొదటికి వచ్చి చెల్లింపుల అంశం మూలనపడిపోయింది. ఈ నేపథ్యంలో బకాయిల కోసం రోడ్డెక్కిన తమకు నోటీసులివ్వడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..