NHRC | కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ నిర్మాణంలో భాగంగా రామకృష్ణయ్య (55) అనే రైతు తన రెండు ఎకరాలు భూమిని ప్రభుత్వం తీసుకోగా.. దానికి సంబంధించిన 29 లక్షల భూ పరిహారం కోసం గత సంవత్సరం సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులు సరిగా స్పందించకపోవడంతో కలెక్టరేట్లో అధికారుల కోసం రోజుల తరబడి తిరుగుతూ, వేచి చూస్తూ ఆగస్టు 21న కలెక్టర్‌లోనే గుండె పోటుతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ గౌడ్ రైతు మృతి ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు రాష్టవ్యాప్తంగా భూపరిహారం కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న మిగతా రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా పరిహారం త్వరితగతిన అందించాలని, ప్రభుత్వ కార్యాలయంలో బాధితులపై నిర్లక్ష్యం వ్యవహరించకుండా వారి వయసు రీత్యా వారికి తగిన గౌరవం ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ రైతు మృతి ఘటనపై తక్షణమే విచారణ చేపట్టిబాధ్యులపై తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి అందిన నష్టపరిహారం, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను నాలుగు వారాల్లోపు కమిషన్ కు సమర్పించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.
Karthika Deepam | కార్తీక దీపం రెండో సీజన్ 600 ఎపిసోడ్లు పూర్తి.. ప్రత్యేక ప్రోమోతో సంబరాలు
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమలకు పెరగనున్న రద్దీ.. వేగంగా దర్శనాలు పూర్తయ్యేలా టీటీడీ ఏర్పాట్లు