Venkaiah Naidu | ఏఐ పై మాజీ ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
Venkaiah Naidu | సాంకేతికతలో వడివడిగా దూసుకెళ్తున్న కృత్తిమ మేథస్సు పై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి : సాంకేతికతలో వడివడిగా దూసుకెళ్తున్న కృత్తిమ మేథస్సు ( Artificial intelligence) పై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ( Venkaiah Naidu ) ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ అంటే భయమేస్తుందని, వింటేనే వణుకు పుడుతోందని ఆయన పేర్కొన్నారు.
విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విధ్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐతో మానవ సంబంధాలు మంటగలసి పోతాయోమోనని భయమేస్తోందని, వావివరుసలు ఎక్కడ మరిచిపోతారెమోనన్న భయం నాలో ఉందని అన్నారు. దీనికి పరిష్కార మార్గాన్ని ఆయన సూచించారు.
విధ్వేషాలు రెచ్చగొట్టకుండా ఏఐని కట్టడి చేయాలని, ఏఐపై ఉన్న భయాలు తొలగించి ఏఐని అదుపులోకి చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. నైతిక పద్దతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్దంగా ఏఐని ఎలా ఉపయోగించుకోవాలన్నది సవాలేనని అన్నారు. లేని పక్షంలో ఏఐ మహాభూతమై సమాజాన్ని సంక్షోభమార్గంలో తీసుకు వెళుతుందని వెల్లడించారు.
ఏఐ వల్ల మానవాళికి నష్టం జరుగకుండా ప్రధాని మోదీ పలు సూచనలు చేశారని వివరించారు. సమాజం కూడా ఎప్పటికప్పుడూ స్పందించి పలు సూచనలు చేయాలని కోరారు. కేంద్రంలోని నరేంద్రమోదీ, ఏపీలో చంద్రబాబు నాయుడు ఏఐని టెక్నాలజీని ముందుకు తీసుకెళుతున్నారని ప్రశంసించారు. రాజకీయ నాయకులు బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారని, గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన వాళ్లంతా ఓడిపోయారని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

