లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి
కొండాపూర్ందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. మృతురాలి భర్త, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగండ్లలో నివాసం ఉండే ధాడి శ్రీనివాస్ తన భార్య అనసూయ(43)తో కలిసి మంగళవారం చందానగర్ చాట్వాజ్ మెన్షన్ అపార్ట్మెంట్లో ఉంటున్న మేనమామ ధాడి గోవింద్‌ను పరామర్శించేందుకు వచ్చారు.
కొండాపూర్ందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. మృతురాలి భర్త, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగండ్లలో నివాసం ఉండే ధాడి శ్రీనివాస్ తన భార్య అనసూయ(43)తో కలిసి మంగళవారం చందానగర్ చాట్వాజ్ మెన్షన్ అపార్ట్మెంట్లో ఉంటున్న మేనమామ ధాడి గోవింద్‌ను పరామర్శించేందుకు వచ్చారు. అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ వద్దకు చేరుకున్న శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్‌లోకి ప్రవేశించగా, అనసూయ లిఫ్ట్‌లోకి ఎకుతున్న సమయంలో ఒక కాలు లోపల, మ రో కాలు బయట ఉండగానే లిఫ్ట్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే అకస్మాత్తుగా పైకి కదిలింది.
దీంతో ఆమె లిఫ్ట్, ప్రవేశ ద్వారం మధ్య ఇరుకుపోయి గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. శ్రీనివాస్ కేకలు వేయడం తో అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు అకడికి చేరుకుని లిఫ్ట్‌ను నిలిపేసి, అనసూయను బయటకు తీసి చందానగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అనసూయ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
కాగా ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ మరమ్మతు పనులు జరుగుతున్నప్పటికీ, లిఫ్ట్ టెక్నీషియన్ అనిల్ కుమార్ ప్రధాన విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా, నివాసితులను అప్రమత్తం చేసేలా ఎలాంటి హెచ్చరిక బోర్డ్డులు ఏర్పాటు చేయకుండా పనులు నిర్వహించాడని అనసూయ భర్త ఆరోపించారు. అలాగే లిఫ్ట్ టెక్నీషియన్ అనిల్ కుమార్ నిర్లక్ష్యంతో పాటు అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు రామ్‌రెడ్డి, యోగేందర్, వెంకట్‌రెడ్డి, లిఫ్ట్ నిర్వహణ సంస్థ జాన్సన్ ఎలివేటర్స్ యాజమాన్యం నివాసితుల భద్రతను నిర్ధారించడంలో విఫలమవడంతోనే ఈ ప్రమా దం జరిగి తన భార్య మృతి చెందిందని ఫిర్యాదులో పేరొన్నారు. శ్రీనివాస్ ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

