Char Dham Yatra: బ్యాడ్ వెదర్.. శని, ఆదివారాల్లో ఛార్థామ్ యాత్ర రద్దు
Char Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శని, ఆదివారం.. ఛార్‌ధామ్ యాత్రను రద్దు చేశారు. భారతీయ వాతావరణ శాఖ ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శని, ఆదివారం .. ఛార్‌ధామ్ యాత్ర(Char Dham Yatra)ను రద్దు చేశారు. భారతీయ వాతావరణ శాఖ ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఘర్వాల్ కమీషనర్ ఆనంద్ స్వరూప్.. అన్ని జిల్లా మెజిస్ట్రేట్లకు లేఖను రిలీజ్ చేశారు. వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా, యాత్రికుల క్షేమం కోసం, ఛార్‌ధామ్ యాత్రను శని, ఆదివారాల్లో రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షంపై రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తప్పవన్నారు. సంబంధిత జిల్లా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని తన లేఖలో మెజిస్ట్రేట్లను కోరారు.
వాతావరణం కుదుట పడిన తర్వాత మళ్లీ యాత్రను ప్రారంభించనున్నట్లు చెప్పారు. శనివారం కోసం భగేశ్వర్, పిత్తోరఘర్, చంపావత్, నైనిటాల్, ఉద్దంసింగ్ నగర్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక డెహ్రాడూన్, పౌరి, రుద్రప్రయాగ్, చమోలీ, ఆల్మోరా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇక హరిద్వార్, ఉత్తరకాశీ, తెహ్రీ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేశారు. ఇక ఆదివారం కోసం డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి, హరిద్వార్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

