‘చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా ప్రకటించాలి’
చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా ప్రకటించాలని చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ నాగిళ్ల శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్బండ వర్గాల మేల్కొల్పు గాత్రం, తెలంగాణ తల్లి వీరనారి, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా...
– చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ నాగిళ్ల శంకర్
చండూరు, సెప్టెంబర్ 26 : చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా ప్రకటించాలని చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ నాగిళ్ల శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్బండ వర్గాల మేల్కొల్పు గాత్రం, తెలంగాణ తల్లి వీరనారి, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి చండూరు పట్టణ కేంద్రంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ట్యాంకుబండ్ పై ఐలమ్మ వంద అడుగుల విగ్రహాన్ని పెట్టాలన్నారు. రాబోయే రోజుల్లో చాకలి ఐలమ్మ చిత్రాలు పంచడం, ప్రతిమలు ఇవ్వడం, ఐలమ్మ పురస్కారాలు, అవార్డులు ఇవ్వడం జరుగుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, భూతరాజు దేవదాసు, ఐతరాజు మల్లేష్, భూతరాజు శ్రీహరి, భూతరాజు నరేష్, భూతరాజు యాదగిరి, భూతరాజు పాండు, భూతరాజు వెంకన్న, భూతరాజు శేఖర్, నలపరాజు శంకర్, కొండమీది లవకుమార్, ఏలే చంద్రశేఖర్ జన్ను, గంగిశెట్టి ప్రకాష్, జాంగిర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

