న్యూఢిల్లీ, ఆగస్టు 4: బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆఫర్ ఫర్ సేల్కు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్న 6.5 శాతం వాటాకు గాను ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.36,400 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఓఎఫ్ఎస్ రూట్లో ఇంతటి స్థాయిలో బిడ్డింగ్‌లు రావడం తొలిసారి కావడం విశేషం. నాలుగేండ్ల క్రితం ఐపీవో ద్వారా 3.5 శాతం వాటాను విక్రయించడంతో రూ.21 వేల కోట్ల నిధులు సమకూరాయి. మళ్లీ ఇప్పుడు కేంద్రం..ఎల్ఐసీలో 6.5 శాతం వాటాను విక్రయించబోతున్నది. త్వరలో ఐపీవోకి రాబోతున్న ఎన్ఎస్ఈ, రిలయన్స్ జియోలకు మంచి ఊతమిచ్చినట్లు అయింది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో 6.5 శాతానికి సమానమైన 82.22 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టింది. మంగళవారం ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 94.45 కోట్ల షేర్లకు బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 3.32 రెట్లు అధిక బిడ్డింగ్‌లు దాఖలయ్యాయని దీపం కార్యదర్శి అరునీష్ చావ్లా పేర్కొన్నారు.
కుప్పకూలిన కంపెనీ షేర్లు
ఒకవైపు ఆఫర్ ఫర్ సేల్కు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా.. మరోవైపు కంపెనీ షేరు కుప్పకూలింది. మంగళవారం కంపెనీ షేరు 7.86 శాతం నష్టపోయి రూ.391కి జారుకున్నది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.4.95 లక్షల కోట్లకు పరిమితమైంది. ఆఫర్ ఫర్ సేల్‌లో సోమవారం షేరు ధరతో పోలిస్తే పది శాతం రాయితీ ఇవ్వడం వల్లనే షేర్లు పతనం చెందాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు అన్నాయి.