Chandrababu Naidu | ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొన్నిసార్లు చేసే కామెంట్లు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు అన్నీ తానే చేశా అన్నట్టుగా చెప్పే మాటలు నెట్టింట వైరల్ అవుతుంటే.. మరోవైపు ట్రోల్స్ చేస్తుంటారు.. ఇక ఆ కామెంట్లపై క్రియేట్ చేసే మీమ్స్ గురించి తెలిసిందే. హైదరాబాద్‌కు ఐటీని నేనే తెచ్చా.. ఈ కంప్యూటర్లు, సెల్ఫోన్లను నేనే తెచ్చా.. టెక్నాలజీని నేనే కనిపెట్టా.. ఇలా ఎన్నో మాటలు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తుంటాయి.
తాజాగా ఏపీలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలు హల్ చల్ చేస్తున్నాయి. వర్షపాతం తక్కువ పడింది. కానీ విశాఖపట్నం ఏరియాలో వరుణ దేవుడు కూడా కరుణించి నేను పోయి.. ఒకసారి మేమందరం ప్రార్థిస్తే ఒకే రోజున 27 సెంటిమీటర్ల వర్షం పడింది. అంటే వరుణ దేవుడికి కూడా మన మీదుండే కరుణ.. అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
నేను ఒకసారి ప్రార్థిస్తే ఒకటే రోజు 27 సెంటీమీటర్ల వర్షం పడింది
అది వరుణ దేవుడికి మన మీద ఉండే కరుణ
– చంద్రబాబు నాయుడు pic.twitter.com/6GoLOf2WIb
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2026
Urvashi Rautela | ఊర్వశి రౌతేలా వర్సెస్ ఏఐ కంపెనీ.. రూ.7 వేల కోట్ల దావా, సీఈఓ ఘాటు కౌంటర్‌తో రచ్చ!