కట్టంగూర్, సెప్టెంబర్ 30 : పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం మండలంలోని ఎరసానిగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుకుని సర్పంచ్ అకిటి శంకర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సయన్వయంతో పని చేయాలని సూచించారు. సమస్యలను అధికారులకు దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీ మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని కాలనీ వాసులను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ మునుగోటి రవీందర్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా చట్టపరమైన మార్గంలో అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, పౌర హక్కులపై ప్రజలకుఅ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మునుగోటి రవీందర్, అర్ఐ జీవీఎస్ రామారావు, జీపీఓ జనార్దన్, పంచాయతీ కార్యదర్శి, పీల్డ్ అసిస్టెంట్, అంగన్ వాడీ టీచర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు.