Realme P4 Lite : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ రియల్‌మి తాజాగా ఒక బడ్జెట్ ఫోన్ రిలీజ్ చేసింది. రియల్‌మి పీ4 లైట్ పేరుతో బడ్జెట్ 4జీ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ఈ నెల 24 నుంచి సేల్కు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు రియల్‌మి పీ4 పవర్ పేరుతో ఒక మీడియం రేంజ్ 5జీ ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇక పీ4 లైట్ ఫీచర్లివి. 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, అప్టు 18 జీబీ డైనమిక్ ర్యామ్, 6.74 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్జ్ టచ్ రెస్పాన్స్ రేట్, 563 నిట్స్ పీక్ బ్రైట్నెస్ 6,300 ఎంఏహెచ్ పవర్ బ్యాటరీ, 15 వాట్స్ వూక్ ఛార్జ్, 300 % అల్ట్రా వాల్యూమ్, ఐపీ 54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, స్మార్ట్ టచ్ టెక్నాలజీ, యునిసాక్ టి7250 ఆక్టాకోర్ చిప్సెట్, 201 గ్రాముల బరువు, 7.94 ఎంఎం విడ్త్, లైనియర్ స్పీకర్, 2 నానో కార్డ్ స్లాట్స్ (1 సిమ్+1సిమ్ లేదా 1 ఎస్డీ కార్డ్), సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, రియల్‌మి యుఐ బేస్డ్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్, 13 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఏఐ వంటి ఫీచర్లున్నాయి.
సీ బ్లూ, బీచ్ గోల్డ్, ఒడీసియన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర 4జీబీ/64జీబీ రూ.7,999, 6జీబీ/128జీబీ రూ.9,999. అలాగే ఎక్స్ఛేంజ్, క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ వంటి ఆఫర్స్‌తో రూ.1,000కి పైగా తగ్గింపు పొందవచ్చు.