(Centurion University)విజయనగరం: తమ విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు వారికి ప్రాక్టికల్స్‌లో అనుభవం అందేటా చూసేందుకు విజయనగరంలోని ప్రముఖ మెడికల్ ల్యాబ్ ఆల్ఫా స్కాన్‌తో సెంచూరియన్ యూనివర్సిటీ జతకట్టింది. ఈ మేరకు ఇరు వర్గాల ప్రతినిధులు ఒప్పందం కాపీలను మార్చుకున్నారు. రెండు సంస్థల మధ్య అవగాహన విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందేందుకు దోహదపడుతుందని ఎంఓయూ అనంతరం వారు చెప్పారు.
బీఎస్సీ రేడియాలజీ విద్యార్థులు స్కానింగ్ సెంటర్, ల్యాబ్‌లను సందర్శించి ప్రాక్టికల్స్‌లో పొల్గొనవచ్చు. వ్యక్తిగత విషయాల్లో కూడా జ్ఞానం పొందవచ్చు. దీనివల్ల విద్యార్థులు సొంతంగా డయాగ్నస్టిక్ సెంటర్లను నిర్వహించుకునేందుకు లేదా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు కూడా దోహదపడనున్నది. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుప్రియా పట్నాయక్, ఆల్ఫా స్కాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజుతోపాటు పలువురు అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..