హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ 27వ స్నాతకోత్సవాన్ని అక్టోబర్ 7న నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. దీనికి ముఖ్య అతిథిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరుకానున్నారని వెల్లడించారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈసారి ప్రముఖ చిత్ర నిర్మాత, రచయిత, నటుడు బీ నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించామని తెలిపారు. స్నాతకోత్సవానికి న్యాక్ మాజీ డైరెక్టర్ డాక్టర్ వీఎస్ ప్రసాద్ కూడా హాజరుకానున్నారని చెప్పారు.