దొండపండులాంటి పెదవులు నల్లబడితే అందమంతా.. వాడిన పువ్వులా మారిపోతుంది. పెదవులకు రంగులద్ది… దానిని నిలుపుకొనేందుకు కష్టపడుతూ ఉన్నా ఫలితం మాత్రం పెద్దగా ఉండదు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి పెదవుల రంగుని తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేయడమే ఉత్తమం. ఎండ సోకడం వల్ల పెదవులు నల్లగా మారుతాయి. జుట్టుకు రంగు వేయడం వల్ల కూడా వీటిపై ప్రభావం ఉంటుంది.
తక్కువ నీళ్లు తాగడం, మేకప్, లిప్‌బామ్, సిగరెట్ ప్రభావం వల్ల పెదవులు నల్లగా మారవచ్చు. కాబట్టి తగినన్ని నీళ్లు తాగుతూ మిగతా వాటిపట్ల జాగ్రత్తగా ఉంటే పెదవులు తిరిగి సహజ రంగులోకి మారతాయి. అలాగే తేనె, పంచదారను సమపాళ్లలో కలిపి, దానిని పెదవులపై అద్ది గట్టిగా రుద్దాలి. ఇలా చేస్తున్నప్పుడు మృత కణాలు తొలగిపోయి నలుపు కొంత తగ్గుతుంది. బీట్రూట్ రసాన్ని పెదవులపై రాసుకుంటే నల్లని మచ్చలు కనిపించవు. రాత్రిపూట ఆల్మండ్ ఆయిల్ లేదా నెయ్యిని పెదవులపై రాసుకుంటే తేమ పెరుగుతుంది. పగుళ్లు తగ్గి మోవి అందం రెట్టింపవుతుంది.