(AP Cinema tickets) అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఏపీ సర్కార్ తీసుకొచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. సినిమా టక్కెట్ల రేట్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాత విధానంలోనే సినిమా టిక్కెట్ల రేట్లను నిర్ణయించేందుకు ఏపీ హైకోర్టు వెసులుబాటు కల్పిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తూ జగన్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 35 ను సస్పెండ్ చేసింది. పాత విధానంలోనే టిక్కెట్లను నిర్ణయించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఏపీ సర్కార్ తీసుకొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులపై పలువురు సినిమా థియేటర్ల యజమానులు ఏపీ హైకోర్టులో ఛాలేంజ్ చేశారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని పిటిషర్లు వాదించారు. టిక్కెట్ల రేట్ల తగ్గింపుపై కోర్టు ఆదేశాలు ఉన్నాయని, కొత్త సినిమాలకు రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యజమానులకు ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో టిక్కెట్ల రేట్లను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 35 ను సస్పెండ్ చేస్తున్నట్లు కీలక ఆదేశాలిచ్చింది. ఇదే సమయంలో పాత పద్ధతిలోనే టిక్కెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును థియేటర్ల యజమానులకు కల్పిస్తూ తీర్పునిచ్చింది.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..