(Amaravathi Farmers) చిత్తూరు: గత కొన్ని రోజులుగా అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్ర తుది ఘట్టానికి చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ రాష్ట్రానికి చెందిన రైతులు గత 44 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర ఇవాళ అలిపిరికి చేరుకోవడంతో ముగియనున్నది. ఇవాళ రాత్రికల్లా రైతులు తిరుమల కొండపైకి చేరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు. రైతులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తమ కోరికను సాధించుకునేందుకు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట అమరావతి రైతులు నవంబర్ 1 న మహా పాదయాత్ర ప్రారంభించారు. 44 రోజులపాటు కొనసాగిన ఈ యాత్రలో దాదాపు 440 కిలోమీటర్లకు పైగా నడిచారు. పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చిత్తూరులో కొనసాగింది. తిరుమల కొండకు చేరుకోవడం ద్వారా ఈ మహాపాదయాత్ర ముగుస్తుంది. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. విజయవంతంగా కొనసాగించారు. యాత్రలో అన్ని జిల్లాల రైతులు పాల్గొనగా.. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. పొరుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.
తిరుమలకు చేరిన రైతులు.. రేపు, ఎల్లుండి స్వామి వారిని దర్శించుకోనున్నారు. రైతుల దర్శనానికి టీటీడీ బోర్డు అనుమతించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని టీటీడీ సూచించింది. రేపు ఒక్కరోజే దాదాపు 500 మంది రైతులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ సంసిద్ధత వ్యక్తం చేసింది. తమ అమరావతి ఆకాంక్షను చాటిచెప్పేలా 17 న సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో రైతు నాయకులు కోర్టును ఆశ్రయించారు. అవాంతరాలు ఎదురైతే తాము బస చేస్తున్న రామానాయుడు కల్యాణమండపంలోనే సభ జరిపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..