Ayatollah Arafi | ఇరాన్ కొత్త లీడర్‌గా అయతొల్లా అలీరెజా అరాఫీ.. ప్రకటించిన ఇరాన్
Ayatollah Arafi : ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా అయతొల్లా అలీరెజా అరాఫీ నియామకమయ్యారు. ఈ మేరకు ఇరాన్ నాయకత్వం ఆయన పేరును ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్‌గా ప్రతిపాదించింది.
Ayatollah Arafi : ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా అయతొల్లా అలీరెజా అరాఫీ నియామకమయ్యారు. ఈ మేరకు ఇరాన్ నాయకత్వం ఆయన పేరును ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్‌గా ప్రతిపాదించింది. ఆయన స్థానికంగా సీనియర్ మత గురువుగానే కాకుండా, గతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకుంది. అయతొల్లా అరాఫీని మధ్యంతర అధినేతగా నియమించింది. ప్రస్తుతం ఇరాన్‌ను అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, చీఫ్ జస్టిస్ ఘోలాంహోస్సేన్ మోసేన్ ఆధ్వర్యంలోని కౌన్సిల్ నడిపిస్తోంది. వీరే అరాఫీని సుప్రీం లీడర్‌గా నియమించారు. అరాఫీ బాధ్యతలు, విధుల్ని ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. అసెంబ్లీ సమావేశమై, ఖమేనీ వారసుడిని ఎన్నుకునేవరకు అరాఫీ నియామకం చెల్లుతుంది. 1959లో జన్మించిన అయతొల్లా అలీరెజా అరాఫీ ఇరాన్లో కీలక నేతగా ఉన్నారు. ఆయన మత గురువుగానే కాకుండా గార్డియన్ కౌన్సిల్, అసెంబ్లీ నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
నేషనల్ నెట్వర్క్ ఆఫ్ ఇస్లామిక్ సెమినరీస్కు నాయకత్వం వహించారు. విద్యావంతుడు. అరబిక్, ఇంగ్లీష్ మాట్లాడగలడు. సాంకేతిక అంశాలపై కూడా ఆయనకు అవగాహన ఉంది. దీంతో ఆయన అయితేనే ప్రస్తుతం ఇరాన్‌ను నడిపించగలరని నాయకత్వం నమ్మింది. ఇకపై అరాఫీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపడుతారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి మత గురువు కూడా ఆయనే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
Harish Rao | గ్రావిటీతో నీళ్లా.. నిరూపిస్తే రాజీనామా? లేదంటే మీరు చేస్తారా ?.. సర్కార్‌కు హరీశ్ ఓపెన్ చాలెంజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

