(AP loans) విజయవాడ: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నది. వీటి నుంచి బయటపడేందుకు అప్పులు తీసుకోవడం ఒక్కటే మార్గం అనే భావనలో ఏపీ సర్కార్ పెద్దలు ఉన్నారు. నానాటికి పెరిగిపోతున్న ఖర్చులు, పథకాల నిర్వహణకు పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి రావడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతున్నది. తాజాగా ఏపీలో ఆర్థిక పరిస్థితులపై కూడా పార్లమెంట్లో చర్చించిన విషయం తెలిసిందే. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదంటూ నిర్మలమ్మ అగ్గిమీద గుగ్గిలమైంది కూడా తెలిసిందే. కేంద్రం ఎంత ఆగ్రహంతో ఉన్నా.. ఎవరెన్ని మాటలు అంటున్నా పట్టించుకోకుండా కొత్త అప్పు కోసం కేంద్రానికి సర్కార్ ఆర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి ఎప్పుడు అనుమతి వస్తుందా అంటూ ఏపీ సర్కార్ చకోర పక్షిలా ఎదురుచూస్తున్నది.
ఏపీ సర్కార్ ఇప్పటికే దాదాపు రూ.1,400 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. అయినప్పటికీ పలు పథకాల కొనసాగింపునకు పెద మొత్తంలో డబ్బు అవసరమైనందున మరోసారి అప్పు కోసం కేంద్రం ముందు ఏపీ సర్కార్ సాగిలబడింది. దీని కోసం వైసీపీ ఎంపీ విజసాయిరెడ్డి తాజాగా కేంద్ర మంత్రి నిర్మలమ్మను కలిసి రుణం ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. ఇప్పటికే నెలనెలా ఆర్బీఐ నుంచి రుణం పొందుతూ అవసరాలు తీసుకుంటున్న ఏపీ సర్కార్కు.. కార్పొరేషన్ల పేరుతో కొత్త రుణాల సమీకరణకు ప్రయత్నాలు కూడా మరోవైపు మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..