వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతున్నది బెంగళూరు భామ ప్రియమణి. ‘ఫ్యామిలీమ్యాన్’ సిరీస్ బాలీవుడ్లోనూ ప్రియమణికి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆమె కీలక పాత్ర పోషించిన విజయ్ ‘జననాయగన్’ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఇదిలావుంటే.. అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్న ఓ ఇండో అమెరికన్ ప్రాజెక్ట్ కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఇటీవలే ప్రియమణిని సంప్రదించారు.
అందులోని కీలక పాత్రకోసం ప్రియమణిని ఎంపిక చేసుకున్నారు. హర్ష్ మహాదేశ్వర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం.. ఇండో అమెరికన్ సంస్కృతుల నేపథ్యంలో ఒక వలస కుటుంబం కొనసాగించే సున్నితమైన భావోద్వేగ ప్రయాణమని తెలుస్తున్నది. ప్రముఖ బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సివుంది.