(Oxygen Plant) కర్నూలు: కర్నూలు జిల్లా పరిధిలోని డోన్‌లో ఏర్పాటుచేసిన ఆక్సీజన్ ప్లాంట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే, రూ.40 లక్షలతో ఆపరేషన్ థియేటర్ (ఓటీ) లో పీడియాట్రిక్, డెలివరీకి సంబంధించిన పరికరాలతో కూడిన యంత్రాల గదిని మంత్రి ప్రారంభించారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ యాక్సెంచర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో రూ.60 లక్షలతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. సౌత్వేస్ మైనింగ్ లిమిటెడ్, ఎస్డబ్ల్యూఎంఎల్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ స్పాన్సర్‌షిప్‌తో రూ.5 లక్షలతో ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను కూడా నెలకొల్పారు.
ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని కొనియాడారు. కొవిడ్ రోగులకు నాణ్యమైన చికిత్స అందించి వారి విలువైన ప్రాణాలను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. చాలా మంది కొవిడ్ వ్యాప్తి సమయంలో ఆక్సిజన్ అందక చాలా ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. ఇకపై ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూదనే ఉద్దేశంతో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పామన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వరరావుతోపాటు మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, డోన్ మున్సిపల్ చైర్మన్ సప్త శైల రాజేష్, వైస్ చైర్మన్ హరి కిషన్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కొలాబ్రేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి శ్రీనివాస్ రావు సత్తి, సౌత్వేస్ మైనింగ్ లిమిటెడ్, ఎస్డబ్ల్యూఎంఎల్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సభ్యులు కేశవరెడ్డి, అంకాల్ రెడ్డి, కర్నూలు ఆర్ఎస్ఓ హరిప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్‌లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..