– సిపిఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్
దామరచర్ల, ఫిబ్రవరి 24 : నాగర్ కర్నూలు జిల్లాలో కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకుని దాడి చేసి రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని దామరచర్ల మండల సిపిఐ కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజక కులానికి చెందిన చంద్రకళ అతని కుమారుడు గణేశ్ మల్లన్న దేవుడి దర్శనానికి వెళ్తుండగా కొంతమంది అగ్రకులాల వారు కుల దుర అహంకారంతో అడ్డుకుని పసిపాప మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రకళ, ఆమె కొడుకు గణేష్, కోడలు, కూతురుని బూతులు తిడుతూ దారుణంగా కొట్టడమే కాకుండా రెండు నెలల పసిపాప ఉందని కూడా కనికరం లేకుండా పాప మృతికి కారకులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. అలాగే బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.